![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-396 లో.. మురారీ, కృష్ణ గదిలో చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారు. ఇక పెళ్ళి తర్వాత శోభనం జరగలేదనే బాధలో మురారి అవకాశం కోసం ఎదురుచూస్తుండగా.. కృష్ణ మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తుంది. ఇక కృష్ణకి దగ్గరగా మురారీ వస్తుంటే ఇప్పుడు వద్దని దూరంగా తోసేస్తుంది కృష్ణ.
మరోగదిలో ఉన్న ముకుంద.. ఫొటోలని చూస్తుండిపోతుంది. అవి మురారీతో ముకుంద తీసుకునన్న ఫోటోలు అవ్వడంతో ఇష్టంగా చూస్తుంటుంది. కాసేపటికి వాష్ రూమ్ నుండి స్నానం చేసి ఆదర్శ్ వస్తాడు. అది గమనించి వెంటనే తన చేతిలోని ఫోటోలని లగేజ్ బ్యాగ్ కింద దాచేస్తుంది ముకుంద. ఇక ఆదర్శ్ చూసాడేమోనని టెన్షన్ గా ఉన్న ముకుందని చూసిన ఆదర్శ్.. ఈ ట్రిప్ కి రావడం నీకు ఓకే కదా అని అంటాడు. ప్లాన్ చేసిందే నేను కదా.. నాకు ఓకే అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీ రెడీ అయి హాల్లోకి వస్తారు. అదే సమయంలో నందు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వాళ్ళని చూసిన మధు.. ఇంతకి ఎక్కడికెళ్తున్నారని అడుగుతాడు. ఏమో మాకు తెలియదు.. ముకుంద ప్లాన్ చేసింది కదా అని కృష్ణ అంటుంది. కాసేపటికి ముకుంద, ఆదర్శ్ వస్తారు. అందరు కలిసి ఎక్కడికెళ్తున్నారని అడుగగా.. సిటీ అవుటర్ లోని రిసార్ట్ కి అని ముకుంద అంటుంది.
ఇక నందుని డ్రాప్ చేయమని మధుకి రేవతి చెప్తుంది. మెదట బిజీగా ఉన్నానని చెప్పిన మధు.. రేవతి కోప్పడేసరికి వెళ్తానంటాడు. ఆ తర్వాత కృష్ణ, ముకుంద, మురారీ, ఆదర్శ్ అంతా కలిసి కార్ లో బయల్దేరతారు. కార్ లో వెళ్తూ మురారీ డ్రైవ్ చేస్తుండగా తన పక్కన కృష్ణ ఉంటుంది.. ముకుంద, ఆదర్శ్ వెనకాల కూర్చుంటారు. కొంతదూరం వెళ్ళాక కార్ ఆపమని ముకుంద చెప్తుంది. అందరు దిగి ఏమైందని అడుగగా.. ప్రతీసారీ మీరే కూర్చుంటారా? మేము కూర్చోవద్దా అని ముకుంద అనేసరికి.. హో అవునా అని కృష్ణ, మురారి నవ్వుకొని వారిని ముందు కూర్చోమని వీళ్ళు వెనకాల కూర్చుంటారు. ఇక మురారీ తలనొప్పిగా ఉందని కృష్ణ వొళ్ళో తలవాల్చుకొని తల నొక్కమని చెప్తాడు. ఇక అది చూసి ముకుందకి కోపం వస్తుంది. మెడికల్ షాప్ దగ్గర కార్ ఆపమని చెప్పి కృష్ణని జండూబామ్ కొనుక్కురమ్మని చెప్తుంది. కాసేపటికి మురారీ తలకి రాయమని చెప్తుంది ముకుంద. ఇక అది మురారీకి రాస్తుంటే కళ్ళు మండుతున్నాయని చెప్పలేక .. చాలు తలనొప్పి తగ్గిపోయిందని చెప్తాడు. తరువాయి భాగంలో అందరు రిసార్ట్ కి వెళ్తారు. అక్కడ ముకుంద తన అన్నతో ఫోన్ మాట్లాడుతుంది. ఇక మీదట ప్రాణాలు తీసే పనులు ఏవీ చేయకని ముకుంద అతనితో అంటుంది. అప్పుడే అక్కడికి అదర్శ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |